ప్రమాదం ముంచుకొస్తోంది!

by Harish |

<p>దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తికి ప్రపంచ వ్యాప్తంగా భయాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫండ్ మేనేజర్ల సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ఇక్కట్లలో ఉందని పేర్కొంది. అత్యధికంగా మార్కెట్ల నుంచి ఈక్విటీ, బ్యాంకింగ్, యూరోజోన్ వంటి ఆస్తుల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పింది. చాలామంది ఆర్థిక మాంద్యం, రుణ ఎగవేతలు, చమురు ధరల క్షీణతతో పాటు కరోనా భయాలు అధికమై పెట్టుబడులను [&hellip;]</p>

ప్రమాదం ముంచుకొస్తోంది!
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా వైరస్ వ్యాప్తికి ప్రపంచ వ్యాప్తంగా భయాలు పెరిగిపోతున్నాయి. ప్రపంచ ఆర్థిక పరిస్థితి కూడా అనుకూలంగా లేదని బ్యాంక్ ఆఫ్ అమెరికా ఫండ్ మేనేజర్ల సర్వే వెల్లడించింది. ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి తీవ్రమైన ఇక్కట్లలో ఉందని పేర్కొంది. అత్యధికంగా మార్కెట్ల నుంచి ఈక్విటీ, బ్యాంకింగ్, యూరోజోన్ వంటి ఆస్తుల నుంచి పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పింది. చాలామంది ఆర్థిక మాంద్యం, రుణ ఎగవేతలు, చమురు ధరల క్షీణతతో పాటు కరోనా భయాలు అధికమై పెట్టుబడులను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఇదే సెంటిమెంట్ కొనసాగితే 2008లో సంభవించిన ఆర్థిక సంక్షోభాన్ని మళ్లీ ఎదుర్కొనక తప్పదని సర్వే అభిప్రాయపడింది. ఈ నెలలో రోజురోజుకు దిగజారుతున్న మార్కెట్లు ఫండ్ మేనేజర్ల నమ్మకాన్ని సడలించడంతో నిధుల కేటాయింపులు క్షీణిస్తున్నాయి. ఈ పరిణామాలు మార్కెట్లకు రిస్క్‌ను తట్టుకునే శక్తిని తగ్గించేస్తోంది. ప్రస్తుత పరిస్థితులు 2001 నాటి నిధుల కేటాయింపు స్థాయికి చేరాయని బ్యాంక్ ఆఫ్ అమెరికా నివేదిక స్పష్టం చేసింది.

ఇక, ఇండియా వృద్ధి రేటును పలు రేటింగ్ సంస్థలు తగ్గించిన విషయం తెలిసిందే. ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ ఎస్అండ్‌పూర్ ఇండియా వృద్ధిరేటును 5.7 శాతం నుంచి 5.2 శాతానికి తగ్గించింది. కరోనా వల్ల ఆసియా దేశాలు ఆర్థిక మాంద్యంలో చిక్కుకుంటాయనే సంకేతాలతో వృద్ధిరేటును తగ్గించినట్టు నివేదికలో వెల్లడించారు. ఇదివరకు, ఆర్గనైజేషన్ ఆఫ్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్‌మెంట్, మూడీస్ వంటి సంస్థలు ఇండియా వృద్ధిరేటును 5.1 శాతంగా అంచానాలను వెల్లడించాయి. దేశీయంగా ఆంక్షలు ఉండటం వల్ల అన్ని రంగాలపై డిమాండ్ అధికంగా ఉందని ఎస్అండ్‌పీ స్పష్టం చేసింది. ప్రధాన దిగుమతి దేశాలు యూరప్, అమెరికా, చైనాల నుంచి డిమాండ్ క్షీణించడం కూడా ప్రతికూల ప్రాభావాన్ని చూపిస్తున్నాయని పేర్కొన్నారు.

రానున్న ఏడాది కాలంలో వృద్ధిరేటు మరింత క్షీణించే అవకాశముందని, కరోనా ప్రభావం ఇంకా పెరుగుతుందని, తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని ఎక్కువమంది ఫండ్ మేనేజర్లు అభిప్రాయపడ్డారు. వృద్ధిరేటు అంచనాలు 1994 తర్వాత ఇప్పటివరకూ ఈ స్థాయిలో తగ్గించలేదని, కేవలం ఒక నెలలో ఈ స్థాయి ఆర్థిక అభివృద్ధి విషయంలో అంచనాలు పతనం కావడం జరగలేదని సర్వే స్పష్టం చేసింది. పెరుగుతున్న ప్రతికూల వాతావరణం కారణంగా ఎక్కువమంది ఫండ్ మేనేజర్లు వీలైనంత వేగంగా ఆస్తులను నగదు రూపంలోకి మార్చుకుంటున్నారు. పెట్టుబడిదారులు ఆర్థిక పరిస్థితిని మరింత అప్రమత్తంగా గమనించాల్సి ఉందని, అంతర్జాతీయంగా కరోన వ్యాప్తి మరింత పెరిగే లోపే, ఇబ్బందికర పరిస్థితులు ముంచుకొచ్చే లోపే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని సర్వే అభిప్రాయపడింది.

tags : BofA fund manager survey, BofA, tail risk

Next Story