మరడోనాకు బ్రెయిన్ సర్జరీ

by  |
మరడోనాకు బ్రెయిన్ సర్జరీ
X

దిశ, స్పోర్ట్స్: ఫుట్‌బాల్ దిగ్గజం డిగో మారడోనా తీవ్ర అనారోగ్యంతో అర్జెంటీనా రాజధాని బ్యూనస్‌ ఎయిర్స్‌లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరారు. ఆయన మెదడులో రక్తం గట్టకట్టుకొని పోవడంతో అతడికి మంగళవారం వైద్యులు సర్జరీ చేశారు. ‘మరడోనా మెదడుకు చేసిన సర్జరీ విజయవంతమైంది.. త్వరలోనే ఆయనను డిశ్చార్జ్ చేస్తాము’ అని ఆసుపత్రి వైద్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం మరడోనా ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తున్నది. మరడోనా సర్జరీ వార్త తెలుసుకొని వందల సంఖ్యలో అభిమానులు ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. 60 ఏళ్ల మరడోనా గత కొంత కాలంగా పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అతడికి రెండు సార్లు గుండె ఆపరేషన్ జరిగింది. హెపటైటిస్ బారిన కూడా పడ్డాడు.

Next Story