10 నెలల కనిష్టానికి తయారీ రంగం- పీఎంఐ

by  |
10 నెలల కనిష్టానికి తయారీ రంగం- పీఎంఐ
X

దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకెండ్ వేవ్ కారణంగా దేశంలోని అనేక రాష్ట్రాలను వ్యాపారాలను పరిమితంగా అనుమతివ్వడంతో దేశీయ తయారీ రంగ ఆర్డర్లు, ఉత్పత్తి 10 నెలల కనిష్టానికి పడిపోయింది. కరోనా వ్యాప్తి కారణంగా డిమాండ్ తగ్గిపోవడం, ముడి పదార్థాల ధరలు అధికం కావడంతో తయారీ రంగం కార్యకలాపాల వృద్ధి దిగజారినట్టు ఐహెచ్ఎస్ మార్కిట్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్(పీఎంఐ) నివేదిక వెల్లడించింది. అంతేకాకుండా మేలో ఉపాధి నష్టం సైతం అత్యధికంగా ఉన్నట్టు పీఎంఐ సూచీ నివేదిక తెలిపింది. మే నెలకు సంబంధించి ఐహెచ్ఎస్ మార్కిట్ పీఎంఐ ఇండెక్స్ సూచీ 50.8కి పతనమైందని, ఏప్రిల్‌లో ఇది 55.5 పాయింట్లుగా నమోదైనట్టు నివేదిక పేర్కొంది.

“కొవిడ్‌ను నియంత్రించేందుకు చాలా రాష్ట్రాలు కఠిన లాక్‌డౌన్ నిబంధనలను అమలు చేయడంతో పాటు పలు పరిశ్రమలు స్వచ్ఛందంగా ఉత్పత్తిని తగ్గించాయి. దీనివల్ల ఆర్థిక కార్యకలాపాలపై ప్రతికూల ప్రభావం పడింది. ప్రస్తుత అమ్మకాలు, ఉత్పత్తి, ఇన్‌పుట్ కొనుగోళ్లు మే నెలలో గణనీయంగా బలహీనపడ్డాయి. దీంతో 2020, జులై నెల తర్వాత తయారీ రంగ పీఎంఐ ఈ స్థాయిలో పతనమవడం ఇదే మొదటిసారి. తయరీ రంగంతో పాటు కీలక రంగాలన్నీ ఏప్రిల్ నెల నుంచి పడిపోయాయని” ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనమిక్స్ అసోసియేట్ డైరెక్టర్ డి లిమా తెలిపారు. ఈ పరిణామాలు వ్యాపారాల పెట్టుబడులకు ఆటంకం కలిగించిన నేపథ్యంలో అత్యధిక ఉపాధి నష్టానికి కారణమైనట్టు డి లిమా వెల్లడించారు.


Next Story

Most Viewed