- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాఫీ కిక్కే వేరు :మంజిమ
<p>దిశ, వెబ్ డెస్క్: మలయాళీ ముద్దుగుమ్మ మంజిమా మోహన్.. మండే మూడ్ పోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వర్కౌట్ తర్వాత చేతిలో కాఫీ కప్‌తో ఉన్న ఫొటో పోస్ట్ చేసిన భామ.. ఒక్క కాఫీ తాగితే ఎంత కిక్ వస్తుందో చెప్పింది. కప్ కాఫీలో ఎలాంటి విషయాలు కనుగొందో లేటెస్ట్ పోస్ట్ ద్వారా తెలిపింది. వన్ కాఫీ సిప్‌లో ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్, బలం, ధైర్యం, ఎలాంటి బ్రేక్ లేకుండా పూర్తి వాక్యాల్లో మాట్లాడే సామర్ధ్యం, సహనం, గుర్తుంచుకోవలసిన […]</p>

దిశ, వెబ్ డెస్క్: మలయాళీ ముద్దుగుమ్మ మంజిమా మోహన్.. మండే మూడ్ పోస్ట్ ఇంట్రెస్టింగ్‌గా ఉంది. వర్కౌట్ తర్వాత చేతిలో కాఫీ కప్‌తో ఉన్న ఫొటో పోస్ట్ చేసిన భామ.. ఒక్క కాఫీ తాగితే ఎంత కిక్ వస్తుందో చెప్పింది. కప్ కాఫీలో ఎలాంటి విషయాలు కనుగొందో లేటెస్ట్ పోస్ట్ ద్వారా తెలిపింది. వన్ కాఫీ సిప్‌లో ‘సెన్స్ ఆఫ్ హ్యూమర్, బలం, ధైర్యం, ఎలాంటి బ్రేక్ లేకుండా పూర్తి వాక్యాల్లో మాట్లాడే సామర్ధ్యం, సహనం, గుర్తుంచుకోవలసిన విషయాలు’ కనుగొన్నానని చెప్పింది. మీరు కూడా ఒక కప్ కాఫీ సిప్ చేసి.. ఎలాంటి విషయాలు అబ్జర్వ్ చేశారో చెప్పాలని అభిమానులకు సూచిస్తోంది. అయితే ఒక కప్ కాఫీ తాగితే తలనొప్పి తగ్గుతుంది.. ఉత్సాహం వస్తుందని తెలుసు.. కానీ మరీ ఇన్ని విషయాలు గుర్తించడం నీకొక్క దానికే సాధ్యం అంటున్నారు అభిమానులు.
‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై తనదైన ముద్రవేసిన మంజిమ.. ఆ తర్వాత ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ తమిళ్, మలయాళంలో మాత్రం చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా వస్తున్న ‘తుగ్లక్ దర్బార్’లో కీలక పాత్రలో కనిపించబోతుంది. సేతుపతికి చెల్లెలుగా కనిపించబోతున్న మంజిమకు ఈ క్యారెక్టర్ మంచి గుర్తింపునిస్తుందని ఆశిస్తుంది.






