- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విశ్వాసాన్ని గెలుచుకున్న మణిపూర్ సీఎం
<p>గువహతి: మణిపూర్ సీఎం ఎన్ బీరేంద్ర సింగ్ అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని గెలుపొందారు. సీఎంకు మద్దతుగా చట్టసభ్యులు ముజువాణి ద్వారా మద్దతు పలుకగా బీజేపీ నేతృత్వంలోని కూటమే అధికారాన్ని నిలుపుకున్నది. కాగా, ఈ ఓటింగ్‌లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. మాజీ బీజేపీ నేత ప్రమేయమున్నట్టు భావిస్తున్న డ్రగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ను సర్కారు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ గతనెల 28న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తన బలాన్ని […]</p>

X
గువహతి: మణిపూర్ సీఎం ఎన్ బీరేంద్ర సింగ్ అసెంబ్లీలో మెజార్టీ ఎమ్మెల్యేల విశ్వాసాన్ని గెలుపొందారు. సీఎంకు మద్దతుగా చట్టసభ్యులు ముజువాణి ద్వారా మద్దతు పలుకగా బీజేపీ నేతృత్వంలోని కూటమే అధికారాన్ని నిలుపుకున్నది. కాగా, ఈ ఓటింగ్‌లో ఎనిమిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు.
మాజీ బీజేపీ నేత ప్రమేయమున్నట్టు భావిస్తున్న డ్రగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రతిపక్ష డిమాండ్‌ను సర్కారు అంగీకరించకపోవడంతో కాంగ్రెస్ గతనెల 28న అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలోనే శుక్రవారం తన బలాన్ని నిరూపించుకునే తీర్మానాన్ని సీఎం ప్రతిపాదించారు. ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో సోమవారం నిర్వహించిన అసెంబ్లీ సమావేశంలో సీఎం బీరెంద్ర సింగ్ తన బలాన్ని నిరూపించుకుని ఎన్‌పీపీ, ఎన్‌పీఎఫ్, టీఎంసీ, ఎల్జేపీ, బీజేపీ కూటమికి అధికారాన్ని సుస్థిరం చేసుకున్నారు.
Next Story






