- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బదిలీల్లో అవకతవకలు.. ఉద్యోగుల నిరసన
<p>దిశ, నాగర్ కర్నూల్ : విద్యుత్ ఉద్యోగుల బదిలీల్లో ఉన్నతాధికారులు ఒక యూనియన్, కులాల ప్రాతిపదికన బదిలీలు చేపడుతూ అవకతవకలకు పాల్పడ్డారని నిరసిస్తూ గురువారం 1104 యూనియన్ విద్యుత్ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయంలోని చాంబర్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. 2020-21సాధారణ బదిలీల్లో భాగంగా కేవలం ఒక యూనియన్ ఉద్యోగులకు దగ్గరగా వేసి మరికొంత మందిని చాలా దూరం పంపుతున్నారని మండిపడ్డారు. గత ఆరు రోజులుగా నిరసన తెలిపినా అధికారులు స్పందించక పోవడంతో ముందుగా కార్యాలయ […]</p>

దిశ, నాగర్ కర్నూల్ : విద్యుత్ ఉద్యోగుల బదిలీల్లో ఉన్నతాధికారులు ఒక యూనియన్, కులాల ప్రాతిపదికన బదిలీలు చేపడుతూ అవకతవకలకు పాల్పడ్డారని నిరసిస్తూ గురువారం 1104 యూనియన్ విద్యుత్ ఉద్యోగులు జిల్లా కేంద్రంలోని ఎస్సీ కార్యాలయంలోని చాంబర్‌లో బైఠాయించి నిరసన తెలిపారు. 2020-21సాధారణ బదిలీల్లో భాగంగా కేవలం ఒక యూనియన్ ఉద్యోగులకు దగ్గరగా వేసి మరికొంత మందిని చాలా దూరం పంపుతున్నారని మండిపడ్డారు. గత ఆరు రోజులుగా నిరసన తెలిపినా అధికారులు స్పందించక పోవడంతో ముందుగా కార్యాలయ ముట్టడి అనుకున్న ఉద్యోగులు, ఎస్సీ చాంబర్ లోకి చొచ్చుకొని వెళ్లి బైఠాయించారు.
విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి వారిని ఒప్పించే ప్రయత్నం చేశారు. చివరకు తగు న్యాయం చేస్తామని అధికారులు చెప్పడంతో నిరసనను విరమించారు. నిరసన చేపట్టిన వారిలో 1104 జిల్లా అధ్యక్షులు డి.రామచందర్ నాయక్, రీజినల్ సెక్రటరీ నిరంజన్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, రఘునందన్, డివిజన్ ప్రెసిడెంట్ వీరయ్య, సత్యాచారి, తిరుపతయ్య, రామస్వామి, ముడవత్ రాజునయక్ లు ఉన్నారు.






