Nims Hospital : నిమ్స్‌లో వ్యాక్సిన్ల దందా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

by  |
Nims Hospital : నిమ్స్‌లో వ్యాక్సిన్ల దందా.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : నగరంలోని నిమ్స్ ఆసుపత్రిలో 7వేల వ్యాక్సిన్లు పక్కదారి పట్టిన ఘటన వెలుగులోకి వచ్చింది. అనర్హులకు వ్యాక్సిన్‌ను పంపిణీ చేసినట్టుగా ఆసుపత్రి వర్గాల దృష్టికి రావడంతో నిమ్స్ డైరెక్టర్ మనోహర్ విచారణకు ఆదేశించారు. వ్యాక్సినేషన్ పంపిణీలో కీలక బాధ్యతలు చేపట్టిన ఆసుపత్రి అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణారెడ్డిపై అంతర్గత విచారణ చేపట్టారు.

మెడికల్ సూపరింటెండెంట్ ఎన్‌వి సత్యనారాయణ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ వివరాలను పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేశారు. మార్చి, ఏప్రిల్ నెలలో వాక్సిన్ పంపిణీ చేసిన అందరి వివరాలను ఆన్‌లైన్‌లో ఎందుకు రిజిస్టర్ చేయలేదని అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణారెడ్డిని ప్రశ్నించారు. వాక్సిన్ వేసే ముందు ఐడీ కార్డు, ఆధార్ వివరాలను పరిశీలించకుండా ఎలా ఇచ్చారంటూ నిలదీసారు.

వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలపై తనకు ఎలాంటి సంబంధంలేదని అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ కృష్ణారెడ్డి సమాధానమిచ్చారు. తన సంతకాన్ని ఎవరో ఫోర్జరీ చేశారని.. విచారణ అధికారులకు వివరణ ఇచ్చారు. విచారణను పూర్తి చేసిన అధికారులు మూడు రోజుల్లో రిపోర్ట్‌ను కోర్టుకు సమర్పించనున్నారు. కోర్టు తీర్పు అనంతరం వ్యాక్సిన్ పంపిణీలో అవకతవకలు చేపట్టిన అధికారులపై వేటుపడే అవకాశాలున్నాయి.

Next Story

Most Viewed