మెగా ఫ్యామిలీకి అందని ‘మా ’ ఆహ్వానం.. మరో వివాదాన్ని సృష్టించనుందా ?

by  |
మెగా ఫ్యామిలీకి అందని ‘మా ’ ఆహ్వానం.. మరో వివాదాన్ని సృష్టించనుందా ?
X

దిశ, వెబ్ డెస్క్ : మా ఎన్నికలు ముగిసినా.. వివాదం మాత్రం ముగిసి నట్టు కనిపించడం లేదు. అధ్యక్షునిగా ఎన్నికైన మంచు విష్ణు తన ప్యానల్ సభ్యులతో పాటు ఇవాళ 11 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నాడు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొననున్నారు. ఫిల్మ్ నగర్ కల్చరల్ సెంటర్ లో పదవీ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్టు విష్ణు ప్యానల్ తెలిపింది.

నందమూరి బాలకృష్ణ ఇంటికి వెళ్లిన మంచు విష్ణు, మోహన్ బాబులు తమ ప్రమాణ స్వీకారానికి రావాలని ప్రత్యేకంగా ఆహ్వానించారు. అలాగే సినీ పెద్దలు పరుచూరి బ్రదర్స్, కైకాల సత్యనారాయణ, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావ్ లను కూడా కలిశారు. అయితే ఈ ప్రమాణ స్వీకారం ఆహ్వానం మెగా ఫ్యామిలీకి వెళ్ళలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. కౌంటింగ్ రోజున విష్ణు, చిరంజీవిని ప్రత్యేకంగా కలుస్తానని చెప్పినా ఇంత వరకూ వాళ్లు కలిసింది లేదు దాంతో ఈ ఊహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి.

మంచి మనోజ్ మాత్రం గురువారం నాడు ఒక షూటింగ్ లో పవన్ కళ్యాన్ ను కలిసి మాట్లాడిన విషయం తెలిసిందే. ఈ మీటింగ్ లో విష్ణు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించినట్టు వార్తలు వచ్చినా, ఆ విషయాన్ని అటు మంచు ప్యానల్ కానీ, ఇటు పవన్ కళ్యాన్ గానీ నిర్దారించలేదు. దీంతో అసలు మా రగడ ముగిసిందా ? ఇప్పుడే మెదలైందా అనే అనుమానాలు కూడా సినీ ఇండస్ట్రీ లో మొదలు అయ్యాయి. విష్ణు ప్రమాణ స్వీకారానికి మా లో సభ్యత్వం ఉన్న ప్రతి ఒక్కరికి వ్యక్తి గతంగా మెసేజులు పంపినట్టు సమాచారం. ప్రకాష్ రాజ్ ప్యానల్ లో గెలిచిన అభ్యర్ధులను కూడా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది విష్ణు ప్యానల్.


Next Story

Most Viewed