అతడికి 80.. ఆమెపై కన్నేసి.. ఎంత కావాలో చెప్పు.. నేను చెప్పింది చేస్తే..

by  |
అతడికి 80.. ఆమెపై కన్నేసి.. ఎంత కావాలో చెప్పు.. నేను చెప్పింది చేస్తే..
X

దిశ, వెబ్‌డెస్క్ : కష్టపడి ఎంతో డబ్బు సంపాదించాడు. షాపులు, ఫ్లాట్స్.. ఇలా కొన్ని కోట్లు విలువచేసే సంపదను పోగేశాడు. కానీ అతడిలో ఉన్న కామం అనే వక్రబుద్దిని మాత్రం మార్చుకోలేకపోయాడు. వయసు 80 ఏళ్లు వచ్చినా.. ఓ మహిళపై కామంతో కన్నేశాడు. అంతటితో ఆగకుండా నీ భార్యను తన వద్దకు పంపాలని కోరాడు. ఇందుకోసం రూ. 10,000 ఇస్తానని కూడా చెప్పాడు. ఈ క్రమంలో ఆగ్రహంతో ఆమె భర్త.. సదురు వ్యక్తిని దారుణంగా హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మహారాష్ట్రలోని నవీ ముంబైలో చోటుచేసుకున్నది.

వివరాల ప్రకారం.. శమకాంత్ తుకారమ్ నాయక్(80)కు ఉల్వేలో కోట్లు విలువ చేసే అనేక ఆస్తులు ఉన్నాయి. అయితే శమకాంత్ తరచూ.. మోహన్ చౌదరి(33) అనే వ్యక్తి షాప్‌కు వెళ్లేవాడు. ఈ క్రమంలో అతని భార్యపై శమకాంత్ మోజు పడ్డాడు. దీంతో ఏకంగా మోహన్‌తో రూ.10 వేలు తీసుకొని తన భార్యను తన గోడౌన్‌కు పంపాలని కోరాడు. ఇలా పలుమార్లు మోహన్‌ను తుకారమ్ అడిగాడు.

ఈ క్రమంలో విసుగు చెందిన మోహన్.. ఓ రోజు తుకారమ్‌తో గొడవ పడ్డాడు.. అతన్ని వెనక్కి నెట్టాడు. దీంతో.. అతని తల టేబుల్ కొనకు తాకడంతో రక్తస్రావం జరిగింది. దీంతో వెంటనే మోహన్ షాప్ షట్టర్‌ను మూసివేశాడు. ఆ తర్వాత శమకాంత్ గొంతు కోశాడు. అతను మరణించిన తర్వాత వాష్‌రూమ్‌లో మృతదేహాన్ని దాచిపెట్టాడు. తర్వాత రోజు ఉదయం 5 గంటలకు మృతదేహాన్ని బెడ్‌షీట్‌లో చుట్టి తన బైక్‌పై తీసుకెళ్లి ఉల్వే సెక్టార్ 19లో పడేశాడు.

ఇదిలా ఉండగా ఆగస్టు 29వ తేదీన శమకాంత్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు గత శనివారం సెక్టార్ 19లోని చెరువలో శమకాంత్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. తొలుత ఆస్తి కోసం ఈ హత్య జరిగిందని పోలీసులు భావించినప్పటికీ.. తర్వాత మోహన్ ఈ హత్య చేసినట్టుగా గుర్తించారు.


Next Story