గిన్నిస్ రికార్డ్.. గడ్డంతో 63 కిలోల బరువెత్తిన వ్యక్తి

by  |
గిన్నిస్ రికార్డ్.. గడ్డంతో 63 కిలోల బరువెత్తిన వ్యక్తి
X

దిశ, ఫీచర్స్: ప్రపంచవ్యాప్తంగా నమ్మశక్యంకాని అరుదైన సాహసాలకు గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌కు (GWR) వేదికగా నిలుస్తుంటుంది. ఈ మేరకు GWR ఇన్‌స్టాగ్రామ్ పేజీపై వివిధ వ్యక్తులు సాధించిన రికార్డులను ప్రదర్శించే వీడియోలే దర్శనమిస్తుంటాయి. ఇదిలా ఉంటే, ఓ వ్యక్తి తన గడ్డంతో భారీ బరువును అవలీలగా ఎత్తిన వీడియో ఒకటి ప్రస్తుతం నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సదరు వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకోవడం విశేషం.

అంటానాస్ కాంట్రిమ అనే వ్యక్తి 63.80 కిలోల(140 పౌండ్లు 16 ఔన్స్) బరువున్న ఓ మహిళను తన గడ్డంతో సింపుల్‌గా లిఫ్ట్ చేశాడు. టేబుల్‌పై పడుకుని ఉన్న సదరు లేడీ బాడీ మొత్తాన్ని బెల్టులతో జాగ్రత్తగా ప్యాక్ చేసి, దాని హుక్‌ను అతని గడ్డం చివర వేలాడదీశారు. ఇలా దవడల బలాన్ని ఉపయోగించి బియర్డ్‌తో మనిషి బరువును మోసిన వ్యక్తి వీడియోను గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ తాజాగా ఇన్‌స్టా పేజీలో షేర్ చేయగా, నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ వీడియోపై ఆసక్తికరంగా స్పందిస్తున్న నెటిజన్లు.. అతను గడ్డానికి ఎలాంటి ఉత్పత్తులను ఉపయోగిస్తాడో తెలుసుకోవాలనుందని అడుగుతున్నారు.

https://www.instagram.com/reel/CWcBdj2oJK6/?utm_source=ig_embed&ig_rid=fbd20749-0260-4b6d-9fca-66dc69b7ed3b

Next Story

Most Viewed