రెండేళ్ల బాలికను ‘సెక్సువల్‌’గా వేధించి.. ఫిష్ ట్యాంక్‌లో పడేసిన కామాంధుడు..!

by Vadlamudi Anukaran |

<p>దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి రెండేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఫిష్ ట్యాంకులో పడవేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన దంపతులు బతుకుదెరువు కోసం మంగళూరుకు వచ్చి స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, వీరు బయటకు వెళ్లిన సందర్భంలో పక్కనే నివాసముంటున్న 30 ఏళ్ల వ్యక్తి బాలికను అసభ్యంగా తడుముతూ లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత [&hellip;]</p>

రెండేళ్ల బాలికను ‘సెక్సువల్‌’గా వేధించి.. ఫిష్ ట్యాంక్‌లో పడేసిన కామాంధుడు..!
X

దిశ, వెబ్‌డెస్క్ : కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి రెండేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా ఫిష్ ట్యాంకులో పడవేసిన ఘటన కర్ణాటక రాష్ట్రంలోని మంగళూరులో సోమవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం.. బిహార్‌కు చెందిన దంపతులు బతుకుదెరువు కోసం మంగళూరుకు వచ్చి స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.

అయితే, వీరు బయటకు వెళ్లిన సందర్భంలో పక్కనే నివాసముంటున్న 30 ఏళ్ల వ్యక్తి బాలికను అసభ్యంగా తడుముతూ లైంగికంగా వేధించాడు. ఆ తర్వాత చిన్నారిని ఫిష్ ట్యాంకులో పడవేసి వెళ్లిపోయాడు. పనులు ముగించుకుని ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక కనిపించకపోవడంతో అంతా వెతికారు. చివరకు ఫిష్ ట్యాంకులో బాలిక కనిపించేసరికి ఆందోళనకు గురయ్యారు. ఏం జరిగిందో అని ఆరా తీయగా అసలు విషయం తెలుసుకున్న బాధిత పేరెంట్స్ పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.

Next Story