- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యం మత్తులో.. జూబ్లీహీల్స్ లో వ్యక్తి దారుణ హత్య
<p>దిశ, వెబ్ డెస్క్ : ఫుట్ పాత్ పై కూలీ దారుణ హత్యకు గురయ్యాడు ఈ ఘటన జూబ్లీహీల్స్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. శివ అనే కూలి కూలీ పని చేసుకుంటు ఫుట్ పాత్ పై జీవన సాగిస్తున్నాడు. అయితే అతని తోపాటు మరో ముగ్గురు కూలీలు నిన్న రాత్రి కలసి మద్యం సేవించారు. అనంతరం రాకేశ్ ,శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోగా శివ , డేవిడ్ మాత్రం అక్కడే ఉండిపోయారు. ఈ రోజు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : ఫుట్ పాత్ పై కూలీ దారుణ హత్యకు గురయ్యాడు ఈ ఘటన జూబ్లీహీల్స్ లో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. శివ అనే కూలి కూలీ పని చేసుకుంటు ఫుట్ పాత్ పై జీవన సాగిస్తున్నాడు. అయితే అతని తోపాటు మరో ముగ్గురు కూలీలు నిన్న రాత్రి కలసి మద్యం సేవించారు. అనంతరం రాకేశ్ ,శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్లిపోగా శివ , డేవిడ్ మాత్రం అక్కడే ఉండిపోయారు.
ఈ రోజు ఉదయం శ్రీనివాస్ శివ దగ్గరికి వెళ్లగా అతను చనిపోయి, తలపగిలి రక్తపు మడుగుల్లో కనిపించాడు దీంతో అతను పోలీసులకు సమాచారంఅందించాడు. పోలీసులు హుటా హుటిన ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన పై కేసునమోదు చేసుకుని శివ మిత్రుడు డేవిడ్ పై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






