- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రంలో మరో ‘జై భీమ్’ ఘటన.. పోలీసుల దెబ్బలకు వ్యక్తి మృతి..?
<p>దిశ, డైనమిక్ బ్యూరో: జై భీమ్ సినిమా చూసి నిద్రలేని రాత్రులు గడిపిన ప్రజలు, అలాంటి ఘటనలే రాష్ట్రంలో రోజుకు ఒకటి బయటపడుతుంటే నేటి సమాజాన్ని చూసి భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలు నేరుగా భయాన్ని వీడి పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారని ప్రభుత్వాలు చెబుతుంటే.. ఇలాంటి ఘటనలతో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం నెలకొంది. సూర్యాపేట జిల్లాలో గిరిజనుడిపై పోలీసుల దాడిని మరువకముందే, కామారెడ్డి జిల్లాలో పోలీసుల లాఠీలకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన […]</p>

దిశ, డైనమిక్ బ్యూరో: జై భీమ్ సినిమా చూసి నిద్రలేని రాత్రులు గడిపిన ప్రజలు, అలాంటి ఘటనలే రాష్ట్రంలో రోజుకు ఒకటి బయటపడుతుంటే నేటి సమాజాన్ని చూసి భయాందోళనకు గురయ్యే పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ప్రజలు నేరుగా భయాన్ని వీడి పోలీస్ స్టేషన్‌కు వస్తున్నారని ప్రభుత్వాలు చెబుతుంటే.. ఇలాంటి ఘటనలతో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం నెలకొంది. సూర్యాపేట జిల్లాలో గిరిజనుడిపై పోలీసుల దాడిని మరువకముందే, కామారెడ్డి జిల్లాలో పోలీసుల లాఠీలకు ప్రాణాలు కోల్పోయిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
స్థానికులు, మృతుడి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం..‘‘ కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం శాంతాపూర్ గ్రామానికి చెందిన ఒడింటి భూమాబాయి(50) దీపావళి పండుగ రోజు సాయంత్రం 5.30 నిమిషాలకు ఊరిలోని హనుమాన్ టెంపుల్ దగ్గర కూర్చున్నారు. ఇదే సమయంలో ఆలయానికి సమీపంలోనే కొందరు పేకాట ఆడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని ముందుగా హనుమాన్ టెంపుల్ దగ్గర ఉన్న వారిని కొట్టారు. ఇదే క్రమంలో భూమాబాయిని తీవ్రంగా కొట్టడంతో స్పృహ కోల్పోయాడు.
దీంతో 108 అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లగా.. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ ఆసుపత్రికి షిఫ్ట్ చేశారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికీ ప్రాణాలు మాత్రం కాపాడుకోలేకపోయారు. పోలీసుల దెబ్బలకు రక్తం గడ్డకట్టడంతో పరిస్థితి విషమించి మృతి చెందినట్టు బాధిత కుటుంబీకులు ఆరోపిస్తున్నారు.’’ దీనిపై ప్రస్తుతం నెట్టింట తీవ్ర చర్చ జరుగుతోంది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఇలా చావుదెబ్బలు కొట్టడం ఎంత వరకు సమంజసం అంటూ నెటిజన్లు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఇక ఇదే విషయంపై సదరు పోలీసు స్టేషన్ ఎస్సైను ఆరా తీయగా.. దాడి చేయలేదని, మూర్చ రావడంతో పడిపోయాడంటూ చెప్పుకురావడం గమనార్హం.
#JaiBhim One More
50yr old Odanti Bhimaboya died at Gandhi Hospital 2days ago. His family is refusing to take the body. Bhimaboya resident of Bichkund village in Kamareddy district on 4th November was sitting &watching a few villagers play cards. Police beat him up& he collapsed pic.twitter.com/Lle9SPYtNj— Revathi (@revathitweets) November 12, 2021






