- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
విషాదం.. కూతురు పుట్టిన రోజే తండ్రి మృతి
<p>దిశ, కామారెడ్డి : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు పుట్టింది ఆ గారాల పట్టి. రాత్రికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకునే ముందు ఆ తండ్రి విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. ఈ హృదయ విదారకర ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన మామిడి దేవరాజు(38) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లారీ అసోసియేషన్ మండల అధ్యక్షుడు కావడంతో ఉదయం మండల కేంద్రంలో లారీ అసోసియేషన్ వద్ద […]</p>

దిశ, కామారెడ్డి : దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు పుట్టింది ఆ గారాల పట్టి. రాత్రికి పుట్టిన రోజు వేడుకలు నిర్వహించుకునే ముందు ఆ తండ్రి విద్యుత్ షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. ఈ హృదయ విదారకర ఘటన మాచారెడ్డి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. మాచారెడ్డి మండల కేంద్రానికి చెందిన మామిడి దేవరాజు(38) లారీ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. లారీ అసోసియేషన్ మండల అధ్యక్షుడు కావడంతో ఉదయం మండల కేంద్రంలో లారీ అసోసియేషన్ వద్ద జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు.
సాయంత్రం జెండాను త్వరగా తీసేసి కూతురు పుట్టిన రోజు కోసం కేక్ తీసుకెళ్లాలని భావించాడు. అదే క్రమంలో జెండాను అవతనం చేస్తుండగా జెండా కర్ర ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లపై పడింది. దాంతో విద్యుత్ షాక్‌కు గురైన దేవరాజు జెండా కర్రపైనే పడిపోయాడు. చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకు వెళ్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు.
దేవరాజుకు భార్య లావణ్య, కూతురు వర్ష(8), కొడుకు వర్షిత్(6) ఉన్నారు. పిల్లల్ని గారాబంగా చూసుకునే వాడని, కూతురు పుట్టిన రోజు నాడే ఇలా జరుగుతుందని ఊహించలేదని బంధువులు, గ్రామస్తులు రోదించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.






