సూర్యాపేట జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకరు మృతి

by Chintha Aamani |   (  Updated:2021-06-07 01:09:10  IST  )

<p>దిశ, నేరేడుచర్ల : కరోనా వ్యాధి నుంచి బయటపడిన వారిని బ్లాక్ ఫంగస్ కలవర పెడుతుంది. తాజాగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కల్మెల చెర్వు గ్రామానికి చెందిన వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే అతడికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతను హోంఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అతనికి కళ్ళు ఎర్రబడటం, కంటిచూపు తగ్గినట్లుగా అనిపించడంతో మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి [&hellip;]</p>

సూర్యాపేట జిల్లాలో బ్లాక్ ఫంగస్ కలకలం.. ఒకరు మృతి
X

దిశ, నేరేడుచర్ల : కరోనా వ్యాధి నుంచి బయటపడిన వారిని బ్లాక్ ఫంగస్ కలవర పెడుతుంది. తాజాగా సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని కల్మెల చెర్వు గ్రామానికి చెందిన వ్యక్తిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు బయటపడ్డాయి. అయితే అతడికి ఇటీవల కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో అతను హోంఐసోలేషన్ లో ఉంటూ చికిత్స పొందాడు. కరోనా నుంచి కోలుకున్న తర్వాత అతనికి కళ్ళు ఎర్రబడటం, కంటిచూపు తగ్గినట్లుగా అనిపించడంతో మిర్యాలగూడ పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాడు. ఆయనను పరీక్షించిన డాక్టర్లు బ్లాక్ ఫంగస్ లక్షణాలుగా గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు వచ్చిన ఆయన ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మరణించాడు. మండలంలో మొట్టమొదటిసారిగా ఓ వ్యక్తి బ్లాక్ ఫంగస్ బారిన పడి మరణించడంతో మండలంలోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.

Next Story