నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని వెనుకనుంచి ఢీకొట్టిన లారీ

by Sridhar Babu |   ( Updated:2021-09-24 01:02:55.0  )
Road accident
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల కేంద్రంలోని సింగరేణి జీఎం కార్యాలయ మార్గంలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. శుక్రవారం ఉదయం కాలకృత్యాలు ముగించుకొని ఇంటికి వెళుతున్న చిన్న రాము(50) అనే వ్యక్తిని వెనుకనుంచి లారీ ఢీకొట్టింది. దీంతో రాము అక్కడికక్కడే మృతిచెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి మణుగూరు ఎస్ఐ పురుషోత్తమ్ చేరుకొని మృతుడి మనవడైన ప్రవీణ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story