వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఆటో

by Shyam |

<p>దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం( road accident) లో జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిలుకూరు మండల కేంద్రంలో హుజూర్ నగర్ &#8211; కోదాడ రహదారిపై జరిగింది. కోదాడకు చెందిన వెన్ను రామకృష్ణ (28) తన ఆటో‌లో దానిమ్మ పండ్ల(Pomegranate fruit) ను తీసుకెళ్లి ఊరూరా తిరుగుతూ అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం కూడా తన ఆటోలో దానిమ్మ పండ్లను తీసుకొని పరిసర గ్రామాల్లో [&hellip;]</p>

వెనుక నుంచి లారీ ఢీకొట్టిన ఆటో
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లాలో రోడ్డు ప్రమాదం( road accident) లో జరిగింది. ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన చిలుకూరు మండల కేంద్రంలో హుజూర్ నగర్ – కోదాడ రహదారిపై జరిగింది. కోదాడకు చెందిన వెన్ను రామకృష్ణ (28) తన ఆటో‌లో దానిమ్మ పండ్ల(Pomegranate fruit) ను తీసుకెళ్లి ఊరూరా తిరుగుతూ అమ్ముతూ జీవనం కొనసాగిస్తున్నాడు. గురువారం కూడా తన ఆటోలో దానిమ్మ పండ్లను తీసుకొని పరిసర గ్రామాల్లో అమ్ముకుని తిరుగు ప్రయాణమయ్యాడు. అదే సమయంలో చిలుకూరు వద్ద లారీ నిలిచి ఉంది. ఇది గమనించని రామకృష్ణ ఆటోను వేగంగా నడుపుతూ లారీ ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో రామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు.

Next Story