భార్య కాపురానికి రావడం లేదని మనస్థాపంతో భర్త ఆత్మహత్య..

by Sridhar Babu |   (  Updated:2021-06-10 10:17:44  IST  )

<p>దిశ, మానకొండూరు : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీలో సఫాయిగా పనిచేస్తున్న మోరే సారయ్య (45)కు హుజూరాబాద్ మండలం కాట్రాపల్లి చెందిన మహిళతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది. కాగా, అతని భార్య కొన్ని సంవత్సరాలుగా తల్లి గారి ఇంట్లోనే ఉంటూ కాపురానికి రావడం లేదు. పుట్టింటికి వెళ్లిన భార్య [&hellip;]</p>

Man commits suicide after wife refuses to return home
X

దిశ, మానకొండూరు : భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలోని శంకరపట్నం మండలం మెట్‌పల్లి గ్రామంలో గురువారం ఆలస్యంగా వెలుగుచూసింది. గ్రామస్తుల కథనం ప్రకారం.. గ్రామ పంచాయతీలో సఫాయిగా పనిచేస్తున్న మోరే సారయ్య (45)కు హుజూరాబాద్ మండలం కాట్రాపల్లి చెందిన మహిళతో కొన్నేళ్ల కిందట వివాహం జరిగింది.

కాగా, అతని భార్య కొన్ని సంవత్సరాలుగా తల్లి గారి ఇంట్లోనే ఉంటూ కాపురానికి రావడం లేదు. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సారయ్య ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న కేశవపట్నం పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Next Story