- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మద్యానికి డబ్బులివ్వలేదని పురుగుల మందు తాగేశాడు
by Batti.Sumithra |
<p>దిశ, కోటగిరి: మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన కోటగిరి మండలం సొంపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. సొంపుర్ గ్రామానికి చెందిన చాతురే లింబాద్రి అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఎలాంటి పని చేయకుండా తరుచూ భార్య పిల్లలతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రోజున మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో పురుగుల మందు […]</p>

X
దిశ, కోటగిరి: మద్యానికి బానిసైన వ్యక్తి జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ సంఘటన కోటగిరి మండలం సొంపుర్ గ్రామంలో చోటు చేసుకుంది. స్థానిక ఎస్సై రాము తెలిపిన వివరాల ప్రకారం.. సొంపుర్ గ్రామానికి చెందిన చాతురే లింబాద్రి అనే వ్యక్తి మద్యానికి బానిసయ్యాడు. ఎలాంటి పని చేయకుండా తరుచూ భార్య పిల్లలతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఆదివారం రోజున మద్యం తాగడానికి డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో పురుగుల మందు తాగేశాడు. ఇది గమనించిన కుటుంబీకులు 108లో బోధన్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే పరిస్థితి విషమించిందని.. మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ నేపథ్యంలోనే చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున లింబాద్రి చనిపోయాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై వివరణ ఇచ్చారు.
Next Story






