- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మడికొండలో మర్డర్.. మార్నింగ్ వాక్ చేస్తుండగా ‘గొడ్డలి’తో నరికి..
<p>దిశ, కాళోజీ జంక్షన్ : మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ దారుణ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ శివారులో శనివారం ఉదయం జరిగింది. మడికొండ గ్రామానికి చెందిన వేల్పుల సమ్మయ్య(అల్లం సేట్) అనే వ్యక్తి రాంపేట్ వైపు వాకింగ్‌కు వెళ్లాడు. ఈ సమయంలోనే అతని తలపై గొడ్డలితో వేటు వేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు […]</p>

X
దిశ, కాళోజీ జంక్షన్ : మార్నింగ్ వాకింగ్‌కు వెళ్లిన వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు అత్యంత దారుణంగా గొడ్డలితో నరికి చంపారు. ఈ దారుణ ఘటన వరంగల్ అర్బన్ జిల్లా కాజీపేట మండలం మడికొండ శివారులో శనివారం ఉదయం జరిగింది.
మడికొండ గ్రామానికి చెందిన వేల్పుల సమ్మయ్య(అల్లం సేట్) అనే వ్యక్తి రాంపేట్ వైపు వాకింగ్‌కు వెళ్లాడు. ఈ సమయంలోనే అతని తలపై గొడ్డలితో వేటు వేసి దారుణంగా హత్య చేశారు. సమాచారం అందుకున్న మడికొండ పోలీసులు ఘటన స్థలాన్ని చేరుకున్నారు. క్లూస్ టీంను రంగంలోకి దింపి.. హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించే పనిలో ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సమ్మయ్య హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Next Story






