- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నాగలూరులో వ్యక్తి దారుణ హత్య
<p>దిశ, కుత్బుల్లాపూర్ : నగర శివారు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులూరు లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ నాగూర్ కు చెందిన ఎం.సత్యనారాయణ యాదవ్(40) ఇటీవలే తన భూమి విక్రయించాడు. అయితే బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని కళ్ళు కంపౌండ్ వద్ద కల్లు సేవించి ఇంటికి తిరిగి వస్తున్నాడు. కల్లు తాగే చోట గుర్తు తెలియని వ్యక్తులు అతని వద్ద ఉన్న భూమి అమ్మగా […]</p>

X
దిశ, కుత్బుల్లాపూర్ : నగర శివారు దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగులూరు లో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. వివరాల ప్రకారం.. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ నాగూర్ కు చెందిన ఎం.సత్యనారాయణ యాదవ్(40) ఇటీవలే తన భూమి విక్రయించాడు. అయితే బుధవారం సాయంత్రం గ్రామ సమీపంలోని కళ్ళు కంపౌండ్ వద్ద కల్లు సేవించి ఇంటికి తిరిగి వస్తున్నాడు. కల్లు తాగే చోట గుర్తు తెలియని వ్యక్తులు అతని వద్ద ఉన్న భూమి అమ్మగా వచ్చిన డబ్బులు గమనించి వాటిని దోచుకెళ్లేందుకు జరిగిన పోట్లాటలో హత్య చేసినట్లు తెలుస్తోంది. ఇతను బోరంపేట పిఎసిఎస్ మాజీ చైర్మన్ రవీందర్ యాదవ్ సోదరుడు. ఇతనికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Next Story






