నెత్తిపై 735 గుడ్లు.. ‘ఎగ్‌’సైటింగ్ రికార్డ్ క్రియేట్ చేసిన ఆఫ్రికన్

55
Man balances 735 eggs

దిశ, ఫీచర్స్ : ఎగ్స్ ట్రే లేకుండా ఇంటికి గుడ్లను తీసుకురావడం కత్తిమీద సాము లాంటిది. మనం మాట్లాడేది ఓ పది, పన్నెండు గుడ్ల గురించే. కానీ ఓ వ్యక్తి తన టోపీపై ఏకంగా 735 గుడ్లను మోసి ఔరా అనిపించాడు. అంతేకాదు గుడ్లను నెత్తిపై పెట్టుకుని అలవోకగా నడిచి ప్రపంచ రికార్డు బ్రేక్ చేశాడు. ఈ క్రమంలో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జిడబ్ల్యుఆర్)లో చేరిన వ్యక్తుల విశేషాలను, వారి ప్రతిభను ప్రపంచానికి చూపించేందుకు అధికారిక ఇన్‌స్టాగ్రామ్ పేజీలో వాటిని షేర్ చేస్తోంది గిన్నిస్. అయితే తాజాగా ఎగ్‌మ్యాన్ వీడియోను పంచుకోగా అది వైరల్ అయింది.

‘ఎగ్‌ మ్యాన్‌’గా గుర్తింపు పొందిన పశ్చిమ ఆఫ్రికాలోని బెనిన్‌కు చెందిన గ్రెగొరీ డా సిల్వా, ఎన్నో వేల ప్రదర్శనలో తన ప్రతిభను నిరూపించుకున్నాడు. తాజాగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ కూడా బ్రేక్ చేసిన అతడి వీడియోను గిన్నిస్ నిర్వాహకులు పంచుకున్నారు. ఈ వీడియోలో అతడు తన టోపిపై 735 గుడ్లను అతికించుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తూ నడిచాడు. ఆ గుడ్లన్నింటినీ అతికించడానికి అతడికి మూడు రోజుల టైం పట్టిందట. చైనాలో సీసీటీవీ ఛానెల్‌ నిర్వహించిన గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డు స్పెషల్‌ షోలో ఈ ఫీట్ చేయగా, సింగిల్‌ టోపీపై అత్యధిక గుడ్లు ధరించిన వ్యక్తిగా ప్రపంచ రికార్డ్ నెలకొల్పాడు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..