- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పారిశ్రామికవాడలో గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్
<p>దిశ, పటాన్చెరు: పారిశ్రామికవాడలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం పటాన్చెరు ఎక్సైజ్ సీఐ సీతారాం రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా పెండూరుకు చెందిన ఆకుల ఇసాక్.. బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో నివాసం ఉంటూ గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పేట చెరువు కట్టపై గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రైడ్స్ చేశారు. […]</p>

దిశ, పటాన్చెరు: పారిశ్రామికవాడలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని పటాన్చెరు ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆదివారం పటాన్చెరు ఎక్సైజ్ సీఐ సీతారాం రెడ్డి విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కృష్ణా జిల్లా పెండూరుకు చెందిన ఆకుల ఇసాక్.. బాచుపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్ పెంట్‌హౌస్‌లో నివాసం ఉంటూ గంజాయి విక్రయిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని పేట చెరువు కట్టపై గంజాయి అమ్ముతున్నారన్న విశ్వసనీయ సమాచారంతో పోలీసులు రైడ్స్ చేశారు.
ఇదే సమయంలో చెరువు కట్టపై గంజాయి అమ్మేందుకు వచ్చిన ఆకుల ఇసాక్ (నిందితుడు) వద్ద 52 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి విచారించగా.. బాచుపల్లిలోని ఇంట్లో మరో 3.5 కిలో గంజాయిను గుర్తించారు. ఆ గంజాయితో పాటు సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. గతంలో గంజాయి అమ్మకం కేసులో చందానగర్ పోలీస్ స్టేషన్ ఇతడిపై కేసు నమోదైందని సీఐ గుర్తుచేశారు. నిందితుడికి చాలా మంది వ్యక్తులతో ఫోన్ ద్వారా పరిచయాలు ఉన్నాయని, ఈ క్రమంలోనే విద్యార్థులు, కార్మికులకు గంజాయి సరఫరా చేస్తున్నాడని విచారణలో తేలిందన్నారు.






