హీరోయిన్‌పై హత్యాయత్నం.. అనుకూలంగా మారిందా?

by  |
హీరోయిన్‌పై హత్యాయత్నం.. అనుకూలంగా మారిందా?
X

దిశ, వెబ్‌డెస్క్ : యాక్ట్రెస్ మాల్వీ మల్హోత్ర తన లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ నుంచి ఇంకా బయటపడలేకపోతుంది. లాస్ట్ ఇయర్ అక్టోబర్‌లో ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకోవాలని అడగ్గా.. ఒప్పుకోకపోవడంతో మర్డర్ అటెంప్ట్ చేశాడు. తనను కత్తితో పొడిచి పారిపోయాడు. ప్రస్తుతం అతను జైల్లో ఉండగా.. అప్పటి నుంచి ఇప్పటి వరకు శారీరకంగా, మానసికంగా కోలుకోలేకపోతుంది మాల్వీ. కాగా మల్హోత్ర రీసెంట్‌గా ఫిల్మ్ మేకర్ మధుర్ భండార్కర్‌ను కలిసింది. ఈ నేపథ్యంలో మధుర్ భండార్కర్ అండ్ టీమ్ తనకు మోరల్ సపోర్ట్ ఇస్తూ ‘బ్రేవ్ మాల్వీ.. స్టే స్ట్రాంగ్’ అంటూ కేక్ కట్ చేయించారని తెలిపింది. త్వరలో ఆయన సినిమాలో కూడా నటించే అవకాశం ఉందన్న మల్హోత్ర.. కానీ డాక్టర్స్ మరో రెండు నెలల పాటు ఔట్ డోర్ వెళ్లకూడదని సూచించారని చెప్పింది.

అయితే ఈ ఇన్సిడెంట్ గురించి చెప్పిన ప్రతీసారి చాలా మంది సింపతీ కోసమే ఇదంతా చెప్తోందని.. తద్వారా క్యారెక్టర్స్ పొందేందుకు ట్రై చేస్తుంది అనుకుంటున్నారని తెలిపింది. కానీ ఇలాంటి ఘటనల ద్వారా సానుభూతి పొందేందుకు, పని సంపాదించేందుకు ప్రయత్నించడం లేదని నన్ను నేను నిరూపించుకోవాల్సిన అవసరం ఉందన్న మాల్వీ.. త్వరలో ఆడిషన్స్ ఇస్తానని, మళ్లీ అదే జోష్‌తో మీ ముందుకు వస్తానని చెప్పింది.



Next Story

Most Viewed