- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గదిలో ఓవైపు ఫస్ట్ నైట్.. ఇంతలో వారి ఎంట్రీ.. షాక్‌లో వధువు
<p>దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం నిషేధానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఈ విషయంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉంది. అయితే, అప్పుడప్పుడు వారి తనిఖీల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పెళ్లి వేడుక జరుగుతన్న ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటున్న రూంలోకి పోలీసులు సడెన్ గా వెళ్లి తనిఖీలు నిర్వహించడంపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా కూడా మరోసారి పోలీసులు పెళ్లి […]</p>

దిశ, వెబ్ డెస్క్: బీహార్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం నిషేధానికి పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. ఈ విషయంలో పోలీసుల పాత్ర కీలకంగా ఉంది. అయితే, అప్పుడప్పుడు వారి తనిఖీల విషయంలో పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. పెళ్లి వేడుక జరుగుతన్న ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి కూతురు బట్టలు మార్చుకుంటున్న రూంలోకి పోలీసులు సడెన్ గా వెళ్లి తనిఖీలు నిర్వహించడంపై గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. తాజాగా కూడా మరోసారి పోలీసులు పెళ్లి కూతురు బెడ్ రూంలోకి వెళ్లి తనిఖీలు నిర్వహించారు. దీంతో పోలీసులు, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. పెళ్లి కూతురు, కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వివరాల్లోకి వెళితే.. హజీపూర్ లోని హత్సార్ గంజ్ లో ఉన్న ఇంటిలో ఇటీవలే పెళ్లి వేడుక జరిగింది. అయితే, గురువారం రాత్రి పోలీసులు ఆ ఇంటికి వెళ్లి పెళ్లి కూతురు ఉన్న బెడ్ రూంలో తనిఖీలు నిర్వహించారు. దీంతో ఆ పెళ్లి కూతురు మొదటగా షాకైంది. ఆ తర్వాత వారిని ఎందుకు వచ్చారు..? ఏం వెతుకుతున్నారు? అసలు మీకేం కావాలి? అని ఆమె పోలీసులను ప్రశ్నించింది. సైలెంట్ గా ఉండూ అంటూ ఆమెను పోలీసులు వారించారు. కొద్దిసేపటి తర్వాత వారు మద్యం బాటిళ్ల కోసం వెతుకుతున్నారని తెలిసి ఖంగుతిన్నది. మద్యం బాటిళ్లు ఏమి కనిపించకపోవడంతో పోలీసులు తిరిగి వెళ్లిపోయారు. పెళ్లి కూతురు అత్త కూడా పోలీసులు వచ్చి తనిఖీ చేయడంతో స్పృహ తప్పి పడిపోయింది. అయినా కూడా పోలీసులు ఏ మాత్రం మానవత్వం చూపించకుండా తనిఖీలు నిర్వహించారని, తమ ఇంట్లో ఎవరికి కూడా మద్యం సేవించే అలవాటు లేదని వాపోయింది. పోలీసులు తనిఖీలు నిర్వహించినప్పటి నుంచి తమను, తమ ఫ్యామిలీని చుట్టుపక్కల వాళ్లు అదోలా చూస్తున్నారని, తమ ఇంటికి ఎవరూ రావడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిపక్షాలు కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నాయి. సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. పోలీసులు మాత్రం ప్రభుత్వం అమలు చేస్తున్న మద్యం నిషేధంలో భాగంగానే తనిఖీలు నిర్వహించామని చెబుతున్నారు.






