ప్రముఖ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ కన్నుమూత

by  |
director-Sivan
X

దిశ, సినిమా : మలయాళం సినిమాటోగ్రాఫర్, డైరెక్టర్ శివన్(89) గుండెపోటుతో మరణించారు. తిరువనంతపురంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. ప్రముఖ ఫొటోగ్రాఫర్స్ సంతోష్ శివన్, సంగీత్ శివన్, సంజీవ్ శివన్‌‌ల తండ్రి అయిన శివన్.. నేషనల్ అవార్డు కూడా అందుకున్నారు. కాగా తను లేకుండా ఈ ప్రపంచాన్ని ఊహించుకోలేకపోతున్నామని ట్విట్టర్ వేదికగా తెలిపిన సంగీత్ శివన్.. మీరు పై నుంచే మార్గనిర్దేశం చేస్తూ, తమ మార్గాన్ని సుగమం చేస్తారనే నమ్మకంతో ఉన్నామని తెలిపాడు. శివన్ మరణంతో ఇండస్ట్రీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Next Story

Most Viewed