నాకు కూతురు కావాలని ఉంది : మలైకా

by  |
నాకు కూతురు కావాలని ఉంది : మలైకా
X

దిశ, సినిమా: బాలీవుడ్ ఐటమ్ గర్ల్ మలైకా అరోరా తనకు కూతురు కావాలన్న విషయంపై ఓపెన్ అయింది. సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌లో ప్రసారమవుతున్న డాన్స్ రియాలిటీ షో ‘సూపర్ డాన్స్ : చాప్టర్ 4’ లేటెస్ట్ ఎపిసోడ్‌లో గెస్ట్ అప్పియరెన్స్ ఇచ్చిన ఈ హాట్ భామ.. ఈ విషయంపై తన మనసులో మాట బయటపెట్టింది. ఆరేళ్ల వయసున్న బేబీ కంటెస్టెంట్ ఫ్లోరినా గొగోయ్ పర్ఫార్మెన్స్‌కు ఫిదా అయిన మలైకా, ఆ పాపను దగ్గరకు తీసుకొని నాకొక కూతురుంటే బాగుండని ఎప్పుడూ అనిపిస్తూనే ఉంటుందని వివరించింది. ఈ క్రమంలో ఫ్లోరినాతో కాసేపు ముచ్చటించింది.

నేను నిన్ను మా ఇంటికి తీసుకెళ్లనా? అక్కడ మా అబ్బాయితో ఆడుకోవచ్చని క్యూట్ గర్ల్‌ను అడిగిన మలైక.. మా ఇంట్లో బ్యూటిఫుల్ షూస్, క్లాత్స్ ఉన్నా వాటిని వేసుకునే వారే లేరని వాపోయింది. అంతేకాదు ఫ్లోరినా క్యూట్‌నెస్‌ చూసి తనకొక హగ్, కిస్ ఇవ్వమని అడిగింది. కాగా ఫ్లోరినా 1980sలో ఆశాభోంస్లే పాడిన ‘డిస్కో స్టేషన్’ సాంగ్‌కు పర్ఫార్మ్ చేయగా.. మలైకా కూడా తనతో కలిసి స్టేజిపై స్టెప్పులేయడం విశేషం.


Next Story

Most Viewed