హర్భజన్ ‘ఫ్రెండ్‌షిప్’ నుంచి సాంగ్ రిలీజ్

by  |
Harbhajan,-Friendship
X

దిశ, సినిమా : స్పిన్ మాయాజాలంతో టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలందించిన మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ నటుడిగా తెరంగేట్రం చేస్తున్న విషయం తెలిసిందే. క్రికెట్ కెరీర్‌లో అగ్రెసివ్‌ ప్లేయర్‌గా పేరు తెచ్చుకున్న భజ్జీ.. ‘ఫ్రెండ్‌షిప్’ చిత్రంలో యాక్టర్‌గానూ ప్రూవ్ చేసుకోబోతున్నాడు. జాన్ పాల్ రాజ్-శ్యామ్ సూర్య కంబైన్డ్ డైరెక్షన్‌లో వస్తున్న సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇక శనివారం హర్భజన్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ తెలిపిన మేకర్స్.. సినిమాలోని ‘అరిచి అరగదీయమ్మ’ అనే సాంగ్ విడుదల చేశారు.

రూ. 25 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం బ్యాలన్స్ షూటింగ్ పార్ట్‌ను ముగించుకుని ఆగస్టులో రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ చిత్రాన్ని ఆర్.కె ఎంటర్‌టైన్మెంట్స్ సమర్పణలో శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్‌పై ఏఎన్ బాలాజీ నిర్మిస్తుండగా.. ప్రముఖ తమిళ నిర్మాత జె.సతీష్ కుమార్ (జేఎస్‌కే) విలన్‌గా కనిపించనున్నారు. ఇక తమిళ బిగ్ బాస్ విన్నర్, మాజీ ‘మిస్ శ్రీలంక’ లోస్లియా హీరోయిన్‌గా నటిస్తుండటం విశేషం. మాటల రచయితగా రాజశేఖర్ రెడ్డి పనిచేస్తున్న చిత్రానికి డీఎం ఉదయ్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్ కాగా, శాంతకుమార్ సినిమాటోగ్రాఫర్.

Next Story

Most Viewed