- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం
<p>దిశ ప్రతినిధి, నల్లగొండ: సీసీఐ కొనుగోలు కేంద్రంగా ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలోని వరలక్ష్మి కాటన్ మిల్లులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ మిల్లు సీసీఐ కొనుగోలు కేంద్రంగా ఉండడంతో భారీ పత్తి నిల్వలు ఉన్నాయి. దీనికితోడు పరిసర గ్రామాల నుంచి సైతం రైతులు పత్తిని విక్రయించేందుకు జిన్నింగ్ మిల్లుకు తీసుకొచ్చారు. దీంతో చాలా మొత్తంలో పత్తి అగ్నికి ఆహుతి […]</p>

దిశ ప్రతినిధి, నల్లగొండ: సీసీఐ కొనుగోలు కేంద్రంగా ఉన్న ఓ జిన్నింగ్ మిల్లులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చౌడంపల్లి గ్రామంలోని వరలక్ష్మి కాటన్ మిల్లులో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. ప్రస్తుతం ఈ మిల్లు సీసీఐ కొనుగోలు కేంద్రంగా ఉండడంతో భారీ పత్తి నిల్వలు ఉన్నాయి. దీనికితోడు పరిసర గ్రామాల నుంచి సైతం రైతులు పత్తిని విక్రయించేందుకు జిన్నింగ్ మిల్లుకు తీసుకొచ్చారు. దీంతో చాలా మొత్తంలో పత్తి అగ్నికి ఆహుతి అయింది. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు మిల్లుకు చేరుకుని ఫైరింజన్లతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గురైన పత్తి నిల్వలు సీసీఐ అధికారులు కొనుగోలు చేసినవి కావడం గమనార్హం. ఈ అగ్నిప్రమాదంలో భారీగా ఆస్తినష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనాగా భావిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






