ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి… బీజేపీ కొత్త వ్యూహమా?

by  |
ఎమ్మెల్యే అభ్యర్థిగా పనిమనిషి… బీజేపీ కొత్త వ్యూహమా?
X

దిశ,వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు రోజు రోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ఈసారి ఎలాగైనా పశ్చిమ బెంగాల్ లో కాషాయ జెండా ఎగరవేసి మమతా సీటుకు ఎసరు పెట్టాలని బీజేపీ కొత్త కొత్త వ్యూహాలను రచిస్తుంది. ఇప్పటికే నామినేషన్లు వేసిన అభ్యర్థులు ప్రచార హోరులో పాల్గొని ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లో ఒక మహిళా అభ్యర్థి పేరు మారుమ్రోగుతుంది.

ఆమె కలిత… ఒక పనిపనిషి. పశ్చిమ బెంగాల్ లోని అస్ గ్రామ్ నియోజకవర్గం నుండి బీజేపీ తరుపున పోటీచేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి. కలిత అనే ఒక పనిమనిషిని బీజేపీ అధిష్టానం ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం కలిత ఒక నెల రోజులు ఆమె పనికి సెలవు పెట్టి తాపీ మేస్త్రి అయిన తన భర్తతో కలిసి ప్రచారంలో పాల్గొంటుంది. ఇక ఎంత పనిమనిషి అయినా కలిత ప్రచారం మాములుగా చేయడంలేదు. మమతా బెనర్జీ మీదే వ్యంగ్యాస్త్రాలు సంధిస్తోంది. “మోకాలి గాయంతో మమతా ఎన్నికల ఆట ఎలా ఆడతారు” అంటూ గట్టిగానే ప్రచారం చేస్తుంది. ఇకపోతే ఈ ఎన్నికలు మార్చి 27 న జరగనున్నాయి.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed