అత్యాచారాలు, హత్యలు ఇంకెన్నాళ్లు.. మహిళా సంఘాల ధర్నా

by Shyam |

<p>దిశ, కామారెడ్డి: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మహిళా సంఘాలు ప్రశ్నించాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన సుధారాణి.. హైదరాబాదులోని ప్రగతినగర్‌లో భర్త కిరణ్ కుమార్ చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేదని, నిందితుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. వెంటనే అతడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో [&hellip;]</p>

అత్యాచారాలు, హత్యలు ఇంకెన్నాళ్లు.. మహిళా సంఘాల ధర్నా
X

దిశ, కామారెడ్డి: రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని మహిళా సంఘాలు ప్రశ్నించాయి. కామారెడ్డి పట్టణానికి చెందిన సుధారాణి.. హైదరాబాదులోని ప్రగతినగర్‌లో భర్త కిరణ్ కుమార్ చేతిలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్నా కేసులో పురోగతి లేదని, నిందితుడిపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని.. వెంటనే అతడిని ఉరి తీయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి జిల్లా కేంద్రంలో మహిళా సంఘాల ఆధ్వర్యంలో సుధారాణి కుటుంబ సభ్యులు, బంధువులు పెద్ద సంఖ్యలో ఆందోళనకు దిగారు.

‘మొన్న నిర్భయ, నిన్న అభయ, నేడు సుధారాణి.. ఇంకెన్నాళ్లు ఆడ పిల్లలపై ఈ అఘాయిత్యాలు అంటూ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ధర్నా చేపట్టారు. జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద సుమారు గంటపాటు ఆందోళన చేపట్టారు. దీంతో ఇరువైపులా రాకపోకలు స్తంభించాయి. ఘటన జరిగింది బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అయితే ఇక్కడ ధర్నా చేయడం సరికాదని పోలీసులు చెప్పడంతో పోలీసులకు, బాధిత కుటుంబ సభ్యులకు తీవ్రస్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుంది. గంట తర్వాత కొత్త బస్టాండ్ నుంచి నిజాంసాగర్ చౌరస్తా వరకు భారీగా ర్యాలీ నిర్వహించి చౌరస్తాలో బైఠాయించారు. నాలుగు వైపులా రహదారి దిగ్బంధించారు. సమాచారం అందుకున్న డీఎస్పీ సోమనాథం అక్కడికి చేరుకుని బాధిత కుటుంబ సభ్యులు, మహిళా సంఘాలతో మాట్లాడారు. చట్టపరంగా నిందితునిపై శిక్ష పడేలా చేస్తామని చెప్పినా వారు వినిపించుకోలేదు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయన్నారు. మహిళలకు రాష్ట్రంలో రక్షణ లేకుండా పోతుందన్నారు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు అత్యాచారాలు, హత్య ఘటనలు జరుగుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆడపిల్లలపై దాడులు జరిగిన వెంటనే నిందితులను తక్షణమే శిక్షించే విధానం రావాలన్నారు. అప్పుడే ఆడపిల్లపై దాడులు చేయడానికి భయపడతారని మహిళా సంఘాల నేతలు చెప్పుకొచ్చారు.

Next Story