లువియానాపై మహేశ్ భట్ లీగల్ యాక్షన్

by Jakkula Samataha |

<p>దిశ, వెబ్‌డెస్క్ : సుశాంత్ మరణం తర్వాత.. బాలీవుడ్‌లో నెపోటిజం, లైంగిక ఆరోపణలు, డ్రగ్స్ వ్యవహారం వంటి ఎన్నో అంశాలు తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దర్శక నిర్మాత మహేశ్ భట్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి లువియానా లోధ్ సైతం మహేశ్ భట్ తనను వేధింపులకు గురి చేశాడని ఆరోపించి వార్తల్లో నిలిచింది. అంతేకాదు మహేశ్ భట్ నుంచి తనకు ప్రమాదం పొంచిఉందని ఆరోపిస్తూ [&hellip;]</p>

లువియానాపై మహేశ్ భట్ లీగల్ యాక్షన్
X

దిశ, వెబ్‌డెస్క్ : సుశాంత్ మరణం తర్వాత.. బాలీవుడ్‌లో నెపోటిజం, లైంగిక ఆరోపణలు, డ్రగ్స్ వ్యవహారం వంటి ఎన్నో అంశాలు తెరమీదకొచ్చాయి. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ దర్శక నిర్మాత మహేశ్ భట్‌పై పలు ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్ నటి లువియానా లోధ్ సైతం మహేశ్ భట్ తనను వేధింపులకు గురి చేశాడని ఆరోపించి వార్తల్లో నిలిచింది. అంతేకాదు మహేశ్ భట్ నుంచి తనకు ప్రమాదం పొంచిఉందని ఆరోపిస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో కూడా పోస్ట్ చేసింది. ఈ నేపథ్యంలోనే మహేష్ భట్,‌ నటి లువియానాపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు.

‘మహేశ్ భట్ బంధువు సుమిత్ సభర్వాల్‌ను కొంతకాలం క్రితం పెళ్లి చేసుకున్నాను. కొంతమంది హీరోయిన్లకు సుమిత్ డ్రగ్స్ సరఫరా చేస్తాడనే విషయం తెలియడంతో ఇటీవల విడాకుల కోసం కోర్టుకెళ్ళాను. ఈ విషయాలన్నీ మహేశ్ భట్‌కు కూడా తెలుసు. ఇండస్ట్రీకి ఆయన ఒక పెద్ద డాన్. ఇక తనను ఇంటి నుంచి బయటకు వెళ్లగొట్టాలని చూశాడని గతంలోనూ ఆయనపై వేధింపుల కేసు పెట్టాను. కానీ పోలీసులు పట్టించుకోలేదు. నాతో పాటు నా ఫ్యామిలీ భద్రత కోసమే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ఒకవేళ నా ఫ్యామిలీకి నాకు ఏదైనా జరగరానిది జరిగితే దానికి కారణం మహేశ్ భట్, ముఖేశ్ భట్, సుమిత్ సభర్వాల్, సాహెల్ సెహగల్, కుంకుమ్ సెహగల్’ అని లువియానా పేర్కొన్నారు. ఈ ఆరోపణలు చేయడంతో.. మహేశ్ భట్ ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాడు.

Next Story