అదిరిపోయే స్టెప్పులేసిన మహేష్ బాబు కూతురు సితార ( వీడియో వైరల్)

426

దిశ, వెబ్‌డెస్క్ : మహేహ్ బాబు గారాల పట్టి సితార చాలా యాక్టివ్‌గా ఉంటుంది. చిన్నతనంలోనే ఓ యూ ట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసి పలు వీడియోలు పోస్ట్ చేస్తూ మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. అంతే కాకుండా ఎప్పటి కప్పుడు సోషల్ మీడియాలో తన హవా నడిపిస్తుంటుంది. చిన్న తనం నుంచి చలాకీగా ఉండటంతో సోషల్ మీడియాలో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. అయితే తాజాగా సితార ఓ వెస్టర్న్ సాంగ్‌కు చిందులేసి వావ్ అనిపించుకుంది. ఆ సాంగ్‌లో సితారం డ్యాన్స్ చూసిన ఎవరైనా సరే తనను పొగడక మానరు. అలా ఫాస్ట్ బీట్‌తో వస్తున్న పాటకు అదిరిపోయే స్టెప్పులేసి ప్రిన్స్ కూతురు అనిపించుకుంది. ఇక ఈ వీడియోను తన సోషల్ మీడయాలో పోస్ట్ చేయగా, సితరా డ్యాన్స్ చూసి సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. అంతే కాకుండా ”సోలోగా ట్రై చేశా.. ఇంకోటి చేయమంటారా?” అని ట్యాగ్ చేసింది. ఇది చూసిన నెటిజన్స్ సితారపై ప్రశంసల వర్షం గుప్పిస్తున్నారు. అప్‌కమింగ్ హీరోయిన్ అంటూ కామెంట్స్ చేస్తుండటం విశేషం.

https://www.instagram.com/reel/CWqhsFOlUUN/?utm_source=ig_web_copy_link