ఆఫ్ సెట్‌లోనూ పర్‌ఫెక్షనిస్ట్ అనిపించుకున్న మహేశ్

by  |
ఆఫ్ సెట్‌లోనూ పర్‌ఫెక్షనిస్ట్ అనిపించుకున్న మహేశ్
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఏజ్‌లో వెనక్కి వెళ్తున్నాడని.. ఏళ్లు గడుస్తున్న కొద్దీ మరింత అందంగా, యంగ్‌గా తయారవుతున్నాడని ప్రశంసించారు ట్రైనర్ మినాష్ గాబ్రియెల్. 2019లో మహేశ్‌ను కలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు చేసిన ప్రయాణంలో ఎన్నో గాయాలతో పోరాడామని, సవాళ్లను అధిగమించామన్న ఆయన.. మహేశ్ ఇంక్రెడిబుల్ షేప్, కండిషనింగ్‌ అనేది ఆయన కృషి, పట్టుదలకు నిదర్శనమని కొనియాడారు.

దుబాయ్‌లో ‘సర్కార్ వారి పాట’ సినిమా షూటింగ్ సమయంలో నెల రోజుల పాటు కూడా వర్కౌట్ చేస్తూనే ఉన్నారని తెలిపారు ట్రైనర్. మ్యాగ్జిమమ్ షూటింగ్ అయ్యాక ఈవినింగ్ టైమ్స్ ట్రైనింగ్ ఉండేదని, ప్రతీ సెషన్‌‌లోనూ తను పడిన కష్టం మరో లెవెల్‌లో ఉండేదని చెప్పాడు. సెట్‌లో అన్ని సవాళ్లను ఎదుర్కొన్న తర్వాత కూడా అంతగా కష్టపడటం చూస్తుంటే ఇన్‌స్పైరింగ్‌గా ఉంటుందన్నాడు. ఒకసారి మహేశ్ జిమ్‌లోకి అడుగుపెడితే ఇంటికి వెళ్లడం కష్టమేనన్న మినాష్ గాబ్రియెల్.. ప్రతీ వర్కౌట్ మినిమమ్ 60 నిమిషాల పాటు ఉంటుందని, ప్రతీరోజు తనను తాను మెరుగుపరుచుకునేందుకే ప్రయత్నిస్తాడని చెప్పాడు. సెట్‌‌లో మాత్రమే కాదు సెట్ బయట కూడా మహేశ్ పర్‌ఫెక్షనిస్ట్ అని.. 100 శాతం ఇచ్చేస్తాడని కాంప్లిమెంట్స్ ఇచ్చాడు.


Next Story