సూపర్ ఫ్యాన్స్ .. 'టేక్ ఏ బో' : మహేష్

by  |
సూపర్ ఫ్యాన్స్ .. టేక్ ఏ బో : మహేష్
X

‘సరిలేరు నీకెవ్వరు’ బ్లాక్ బస్టర్ హిట్‌ సాధించింది. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా 50 రోజులు పూర్తి చేసుకోవడంతో మూవీ యూనిట్ పండగ చేస్కుంటోంది. సోషల్ మీడియాలోను ‘ఆల్ టైం బ్లాక్ బస్టర్ సరిలేరు నీకెవ్వరు’ హాష్ ట్యాగ్ ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబు.. ఫ్యాన్స్‌కు, ఆడియన్స్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ‘సరిలేరు నీకెవ్వరు’పై మీరు చూపించిన అమూల్యమైన అభిమానానికి ధన్యవాదాలు అంటూ ట్వీట్ చేశారు. బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి, నిర్మాత అనిల్ సుంకరలకు బిగ్ హగ్ అంటూ పోస్ట్ పెట్టారు ప్రిన్స్. చిత్ర యూనిట్‌కు థాంక్స్ చెప్పిన మహేష్… మీరు లేకుంటే ఇది సాధ్యం కాకపోయేదన్నారు.

‘సరిలేరు నీకెవ్వరు’ నిర్మాత అనిల్ సుంకర సైతం ఆడియన్స్‌కు థాంక్స్ నోట్ సెండ్ చేశారు. మహేష్ బాబుతో పని చేయాలన్న కల ఈ చిత్రంతో నెరవేరిందని… థాంక్స్ టు సూపర్ ఫ్యాన్స్ ..టేక్ ఏ బో .. అంటూ పోస్ట్ పెట్టారు.


Next Story

Most Viewed