అన్నయ్యకు ప్రిన్స్ విషెస్

by  |
అన్నయ్యకు ప్రిన్స్ విషెస్
X

దిశ, వెబ్‌డెస్క్ :
సూపర్ స్టార్ మహేశ్ బాబు.. తన అన్నయ్య ఘట్టమనేని రమేష్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తను నేర్చుకున్న దానిలో కొంత భాగం అతని నుంచే వచ్చిందని సులభంగా చెప్పగలనన్న మహేశ్.. క్రమశిక్షణ, అంకితభావం, అభిరుచి లాంటి లక్షణాలను నిస్వార్థంగా తనపైకి పంపించారని అన్నాడు. గొప్ప ఆరోగ్యం, ఆనందం కలగాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నట్లు తెలిపాడు. కాగా రమేష్ బాబు హీరోగా వచ్చిన సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ఉన్న మహేశ్.. ఈ సందర్భంగా అన్నతో చేతులు కలిపిన చిన్ననాటి పిక్ షేర్ చేశాడు.

ఆహా ఈ పిక్ చూడడానికే ట్విట్టర్ ఓపెన్ చేసినట్లు ఉంది అంటూ సంబరపడుతున్నారు అభిమానులు. 90 దశకంలో హీరోగా రాణించిన రమేష్ బాబు.. ఎన్నో సూపర్ హిట్స్ అందుకున్నారు.

Next Story