11 ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్

by  |
11 ఏళ్ల తర్వాత మహేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్
X

దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేశ్ బాబు కొత్త సినిమాపై సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చ నిజమైపోయింది. అందరూ అనుకున్నట్లుగానే తన 28వ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్‌లోనే ఓకే అయిపోయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ మూవీని నిర్మిస్తుండగా.. అఫీషియల్‌ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘అతడు’, ‘ఖలేజా’ తర్వాత 11 ఏళ్లకు మహేశ్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌ రిపీట్ అవుతుండగా.. 2022 సమ్మర్‌లో సినిమా రిలీజ్ కానున్నట్లు ప్రకటించారు మేకర్స్. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందనే ధీమాతో ఉన్నారు. సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న పూజా కార్యక్రమాలతో మూవీని లాంచ్ చేయనుండగా.. కాస్ట్ అండ్ క్రూ గురించిన మరిన్ని వివరాలు అదే రోజున రివీల్ చేయనున్నారు.

https://twitter.com/haarikahassine/status/1388463560074752000?s=20

Next Story

Most Viewed