ది ప్రిన్స్ ఆఫ్ హార్ట్స్.. కూల్ అండ్ కంపోజ్డ్ ‘సిద్ధార్థ్’

by  |
mahasamudram
X

దిశ, సినిమా : ‘ఆర్ఎక్స్ 100’ ఫేమ్ అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘మహా సముద్రం’. ఈ సినిమాను ఆగస్టు 19న గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ద్వారా హీరో సిద్ధార్థ్ దాదాపు ఏడేళ్ల గ్యాప్ తర్వాత టాలీవుడ్‌కు రీఎంట్రీ ఇస్తున్నాడు. కాగా ఈ రోజు(శనివారం) తన బ‌ర్త్‌డే సంద‌ర్భంగా ‘మహాసముద్రం’ నుంచి రిలీజైన ఫ‌స్ట్ లుక్‌లో చాలా డీసెంట్‌గా క‌నిపిస్తున్నాడు సిద్ధు. ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలు కాగా.. అదితి రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయల్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై అనిల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, త‌మిళ భాషల్లో తెరకెక్కిస్తున్నారు.

Next Story

Most Viewed