రైలు పట్టాల వెంట పోలీసు పెట్రోలింగ్

by  |
రైలు పట్టాల వెంట పోలీసు పెట్రోలింగ్
X

దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో వలస కూలీల జీవనం దుర్భరంగా మారింది. చేయడానికి ఉపాధి, తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడుతుండటంతో కాలినడకన సొంతూళ్లకు పయనమవుతున్నారు.ఈ క్రమంలోనే రైలు పట్టాల వెంట వలస కార్మికులు రాకపోకలు సాగించకుండా ముందు జాగ్రత్త చర్యగా ఔరంగాబాద్ పోలీసులు పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మధ్యే రైలు పట్టాల వెంట నడుచుకుంటూ వెళుతున్న కార్మికులు అలసిపోయి అక్కడే పడుకోవడంతో గూడ్స్ రైలు కింద పడి 12 మంది మృతి చెందారు.ఈ ప్రమాదం వలన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తాయి.దీంతో అప్రమత్తమైన మహా సర్కార్ ఔరంగాబాద్ మార్గంలోని రైలు పట్టాలపై ఎవరూ వెళ్లకుండా పోలీసులను మొహరించింది.ఈలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు శ్రామిక్ స్పెషల్స్‌తో పాటు ప్రత్యేక రైళ్లు, గూడ్స్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్న మార్గంలో రైలు పట్టాల పక్కన పోలీసులు పెట్రోలింగ్ చేస్తున్నారు.


Next Story

Most Viewed