- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ముంబైలో ఐపీఎల్‌కు లైన్ క్లియర్
by Kema Shiva Kumar |
<p>దిశ, వెబ్‌డెస్క్ :ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లకు లైన్ క్లియర్ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. రాత్రి 8 గంటల తర్వాత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవడంతో పాటు ఆ తర్వాత గ్రౌండ్ నుంచి హోటళ్లకు చేరుకునేందుకు అనుమతి ఇచ్చింది. బయో బబుల్ వాతావరణంలోనే ఆటగాళ్లు ఉండాలని ప్రభుత్వం సూచించింది. నేటి నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలవుతుండగా.. కర్ఫ్యూ సమయంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు, ఆ తర్వాత తిరిగి హోటల్స్‌కి […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ :ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లకు లైన్ క్లియర్ అయింది. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌ల నిర్వహణకు మార్గం సుగమం చేసింది. రాత్రి 8 గంటల తర్వాత ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకోవడంతో పాటు ఆ తర్వాత గ్రౌండ్ నుంచి హోటళ్లకు చేరుకునేందుకు అనుమతి ఇచ్చింది. బయో బబుల్ వాతావరణంలోనే ఆటగాళ్లు ఉండాలని ప్రభుత్వం సూచించింది.
నేటి నుంచి మహారాష్ట్రలో రాత్రి కర్ఫ్యూ అమలవుతుండగా.. కర్ఫ్యూ సమయంలో ఆటగాళ్లు ప్రాక్టీస్ చేసుకునేందుకు, ఆ తర్వాత తిరిగి హోటల్స్‌కి చేరుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక అనుమతి ఇచ్చింది. దీంతో ముంబైలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతాయా?.. లేదా? అనే సందిగ్ధతకు తెర పడినట్లు అయింది. కాగా ఐపీఎల్ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని ఇప్పటికే బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే.
Next Story






