- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సెల్యూట్ కలెక్టర్ సాబ్..
by Shyam |
<p>దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో బిజీగా ఉంటూనే మరోపక్క మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. విధుల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడి సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ రోగికి రక్తం అత్యవసరమని తెలియడంతో ఏ మాత్రం ఆలోచించకుండా రక్తదానం చేసి తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు. ఆపత్కాలంలో సరైన సమయానికి స్పందించి రక్తదానం చేసిన కలెక్టర్ గౌతమ్‌కు […]</p>

X
దిశ, వరంగల్: కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో బిజీగా ఉంటూనే మరోపక్క మానవత్వాన్ని చాటుకున్నారు మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్. విధుల్లో భాగంగా మంగళవారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిని ఆయన సందర్శించారు. అక్కడి సేవల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఓ రోగికి రక్తం అత్యవసరమని తెలియడంతో ఏ మాత్రం ఆలోచించకుండా రక్తదానం చేసి తనకున్న గొప్ప మనసును చాటుకున్నారు. ఆపత్కాలంలో సరైన సమయానికి స్పందించి రక్తదానం చేసిన కలెక్టర్ గౌతమ్‌కు వైద్యులు, సిబ్బంది, అధికారులు, రోగి తరఫు బంధువులు ఫిదా అయ్యారు.
Tags: mahabubabad, collector VP Gautham, humanity, blood donation, Area hospital, patient, corona, virus,
Next Story






