GMR ఏరోసిటీని సందర్శించిన మధ్యప్రదేశ్ అధికారులు..

by  |
GMR ఏరోసిటీని సందర్శించిన మధ్యప్రదేశ్ అధికారులు..
X

దిశ, రాజేంద్రనగర్ : శంషాబాద్ విమానాశ్రయంలోని జీఎంఆర్ ఏరోసిటీని మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన అధికారులు శుక్రవారం సందర్శించారు. ఎస్‌జీకే కిషోర్, ఈడీ-సౌత్ మరియు సీఐఓ మధ్యప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధులకు స్వాగతం పలికి వారికి జీఎంఆర్ వ్యాపారాల గురించి వివరించారు. ఆ తర్వాత మధ్యప్రదేశ్ అధికారులు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్ కార్గోను, ఫ్యూయల్ ఫార్మ్‌ను, జీఎంఆర్ ఏరో టెక్నిక్‌ను సందర్శించారు.

ఈ ప్రతినిధుల బృందం ఇక్కడి మౌలిక సదుపాయాలను, బెస్ట్ ప్రాక్టీసెస్‌ను పరిశీలించి, ఏరోసిటీ అభివృద్ధి ప్రణాళికాల నుంచి విలువైన అంశాలను తెలుసుకున్నారు. ఆఫీసులు, రిటైల్, ఆతిథ్యం, విద్య, హెల్త్‌కేర్ హబ్‌లు, కో-లివింగ్, సర్వీస్డ్ నివాసాలు, బహుళ-ఉత్పత్తి లాజిస్టిక్స్ మరియు గిడ్డంగులతో కూడిన జీఎంఆర్ హైదరాబాద్ ఏరోసిటీని భారతదేశంలో అతిపెద్ద ఏరోట్రోపోలిస్‌గా తీర్చిదిద్దుతున్నారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో ఉన్న కారణంగా జీఎంఆర్ హైదరాబాద్ ఏరోసిటీ అనేక గమ్యస్థానాలతో అనుసంధానించబడింది. పర్యటన అనంతరం జీఎంఆర్ ప్రతినిధులు మధ్యప్రదేశ్ అధికారులకు మెమోంటోలతో సత్కరించి వీడ్కోలు పలికారు.


Next Story

Most Viewed