- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చిన్న వయసులో పెద్దమనసు.. వైరల్‌గా హీరోయిన్ కొడుకు
<p>దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ కొడుకు ర్యాన్.. ఆదివారం నేషనల్ కేన్సర్ అవేర్‌నెస్ డే సందర్భంగా కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేశాడు. ఈ మేరకు అతడే సెలూన్‌లో హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మాధురి.. తన కొడుకు నిర్ణయం గురించి వివరించింది. ‘కేన్సర్ బారినపడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి ర్యాన్ చలించిపోయాడు. అందుకే ఈ కారణంగా జుట్టు కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం […]</p>

దిశ, సినిమా : బాలీవుడ్ సీనియర్ నటి మాధురీ దీక్షిత్ కొడుకు ర్యాన్.. ఆదివారం నేషనల్ కేన్సర్ అవేర్‌నెస్ డే సందర్భంగా కేన్సర్ బాధితుల కోసం తన జుట్టును దానం చేశాడు. ఈ మేరకు అతడే సెలూన్‌లో హెయిర్‌కట్ చేయించుకుంటున్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన మాధురి.. తన కొడుకు నిర్ణయం గురించి వివరించింది. ‘కేన్సర్ బారినపడి కీమో థెరపీ చేయించుకున్న వారిని చూసి ర్యాన్ చలించిపోయాడు. అందుకే ఈ కారణంగా జుట్టు కోల్పోయిన వారిలో ఆత్మవిశ్వాసం నింపేందుకు తన జుట్టును కేన్సర్ సొసైటీకి దానం చేయాలనుకున్నాడు’ అని తెలిపింది.
అయితే ర్యాన్ ఆ విషయాన్ని తనతో చెప్పినపుడు చాలా ఆశ్చర్యపోయామని, దాదాపు రెండేళ్ల నుంచి ఇష్టంగా పెంచుకుంటున్న జుట్టును డొనేట్ చేయడం పట్ల చాలా గర్వంగా ఉందని చెప్పింది. ఇక ర్యాన్ చేసిన మంచి పనిపై స్పందిస్తున్న నెటిజన్లు ‘చిన్న వయసులో పెద్ద మనసు కలిగి ఉన్నందుకు సంతోషంగా ఉంది’ అంటున్నారు.
https://www.instagram.com/reel/CV-U2jIg6kI/?utm_source=ig_web_copy_link
- Tags
- Madhuri Dixit






