బ్రేకింగ్: కంటైనర్‌ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

306
khammam bus accident

దిశ, పాలేరు: ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం చేగొమ్మ క్రాస్ రోడ్డు సమీపంలో ఆదివారం రాత్రి రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళ్తున్న మధిర డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు, ముందు వెళ్తున్న మిల్క్ కంటైనర్ లారీ సడన్ బ్రేక్ వేయడంతో దాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి.

దీనితో సమాచారం అందుకున్న కూసుమంచి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని అబులెన్స్ ద్వారా చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు మధిర నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.