కొండల రాజు బంగరు కొండ.. అదరగొడుతున్న ‘ఆచార్య’

by  |
కొండల రాజు బంగరు కొండ.. అదరగొడుతున్న ‘ఆచార్య’
X

దిశ, సినిమా : కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘ఆచార్య’. ఈ మూవీలో రాంచరణ్ తేజ్ కూడా కీలక పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ రోజు ఆచార్య సినిమా నుంచి ‘లాహే.. లాహే.. కొండల రాజు బంగరు కొండ’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించిన సాంగ్ కాస్త్ ఫోక్ టచ్‌తో జోష్‌ఫుల్‌గా సాగిపోతుండగా, సీనియర్ హీరోయిన్ సంగీత వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక పాట మధ్యలో తళుక్కుమన్న మెగాస్టార్ డాన్స్ మూమెంట్స్ మెగా ఫ్యాన్స్‌కు కిక్ ఇస్తున్నాయి. చాలాఏళ్ల తర్వాత చిరు సినిమాకు మ్యూజిక్ అందించిన మెలోడి బ్రహ్మ మణిశర్మ.. తన గ్రాండియర్‌ను మరోసారి చూపించాడు. కాగా ఈ సినిమాను కొణిదెల ప్రొడక్షన్స్‌తో పాటు మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed