- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విషాదం.. సినీ కవి వెన్నెలకంటి కన్నుమూత
<p>దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీకవి వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ పూర్తి పేరు కాగా ఇంటిపేరు వెన్నెలకంటిగానే సుపరిచితులు. డాక్టర్ ప్రభాకర్ ప్రోద్భలంతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట ద్వారా సినీ పరిశ్రమకు […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీకవి వెన్నెలకంటి కన్నుమూశారు. గుండెపోటుతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తుదిశ్వాస విడిచారు. వెన్నెలకంటి మృతి పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్ పూర్తి పేరు కాగా ఇంటిపేరు వెన్నెలకంటిగానే సుపరిచితులు. డాక్టర్ ప్రభాకర్ ప్రోద్భలంతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట ద్వారా సినీ పరిశ్రమకు వెన్నెలకంటి పరిచయం అయ్యారు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు రాశారు. ఇప్పటివరకు 2000 పాటలు రాసి.. ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచి పోయారు. చివరిగా మహానటి కీర్తి సురేశ్ నటించిన పెంగ్విన్ సినిమాకు లిరిక్స్ అందించారు.
Next Story






