లిరిక్ రైటర్ కృష్ణకాంత్‌కు ఆత్మీయ సన్మానం

by Sridhar Babu |
Wake Society members
X

దిశ, వెబ్‌డెస్క్: సినిమా రంగంలో రాణిస్తూ.. ఎన్నో మంచి చిత్రాలకు పాటలు అందించిన లిరిక్ రైటర్ కృష్ణకాంత్‌ను సూర్యాపేట వేక్ సొసైటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సొసైటీ సభ్యులు మాట్లాడుతూ.. సినీ పరిశ్రమలో ముందుమందు మరింత ఎత్తుకు ఎదగాలని, మరిన్నీ మంచి పాటలు రాయాలని వారు ఆకాంక్షించారు. అంతేగాకుండా ఆయన రాసిన పాటలు చిత్రపరిశ్రమలోనే ఉత్తమ సాంగ్స్‌గా నిలవాలని వారు కోరుకున్నారు. ఈ ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు గంగపురపు గణేష్, హెడ్ నర్స్ గుణగంటి పద్మ, ఆల్ ఇండియా హ్యుమన్ రైట్స్ నల్గొండ జిల్లా సెక్రెటరీ గుండగాని శ్రీనివాస్, రమా, రమేష్, ఉష శేఖర్, లక్ష్మి, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed