- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమికులు ఆత్మహత్య.. మరుసటి రోజు స్నేహితురాలు కూడా..
<p>దిశ, వెబ్‌డెస్క్: పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ విషయమే. ఈ మధ్య కాలంలో ఇది మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది జరిగిన కొద్దిగంటల్లోనే మృతురాలి స్నేహితురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో లాంజీలో సంచలనం రేపింది. వివరాల్లోకివెళితే.. లాంజీకి చెందిన రాజేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సగుంటబాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ, అందుకు పెద్దలు అంగీకరించలేదు. […]</p>

దిశ, వెబ్‌డెస్క్: పెద్దలు అంగీకరించలేదని ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడం కామన్ విషయమే. ఈ మధ్య కాలంలో ఇది మరింతగా పెరిగింది. ఈ నేపథ్యంలోనే పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది జరిగిన కొద్దిగంటల్లోనే మృతురాలి స్నేహితురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్‌లో లాంజీలో సంచలనం రేపింది.
వివరాల్లోకివెళితే.. లాంజీకి చెందిన రాజేష్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన సగుంటబాయిని ప్రేమించాడు. పెళ్లి చేసుకుందామని అనుకున్నారు. కానీ, అందుకు పెద్దలు అంగీకరించలేదు. ఈ క్రమంలోనే రాజేష్ ఈనెల 12వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. అతని మరణవార్త వినగానే ప్రియురాలు సగుంటబాయి మనస్తాపం చెంది జులై 16న ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జరిగిన మరుసటి రోజే సగుంటబాబు స్నేహితురాలు జానకి కూడా ఆత్మహత్యకు పాల్పడింది. ఒకే గ్రామంలో వరుసగా ముగ్గురు సూసైడ్ చేసుకోవడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.






