- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రేమ జంట ఆత్మహత్యాయత్నం.. మాధవి మృతి, రాజు పరిస్థితి విషమం
by Batti.Sumithra |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పెద్దలు తమ ప్రేమను నిరాకరించారని.. ప్రేమ జంట బలవన్మరణానికి యత్నించింది. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి జిల్లాలోని లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాజు(23), మాధవి(17)లు గుళికల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ క్రమంలో వారిద్దరినీ కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. రాజు పరిస్థితి విషమంగా […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : పెద్దలు తమ ప్రేమను నిరాకరించారని.. ప్రేమ జంట బలవన్మరణానికి యత్నించింది. ఈ దారుణ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. శుక్రవారం రాత్రి జిల్లాలోని లింగంపేట్ మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన రాజు(23), మాధవి(17)లు గుళికల మందు తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు.
ఈ క్రమంలో వారిద్దరినీ కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మాధవి శనివారం తెల్లవారుజామున మృతి చెందింది. రాజు పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ ఘటనపై లింగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టనట్టు తెలిపారు.
Next Story






