ప్రియురాలిని హాస్టల్ గోడ దూకించి..

168
Lovers

దిశ, వెబ్‌డెస్క్ : వారిద్దరు ఓకే యూనివర్సిటీలో చదువుకుంటూ.. ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఆదివారం సరదాగా బయటకు వెళ్లిన వారు.. తిరిగి హాస్టల్‌కు వచ్చే సరికి రాత్రి అయింది. గేట్ దగ్గర నుంచి వెళ్తే వాచ్‌మెన్.. వార్డన్‌కు సమాచారం ఇస్తాడని.. దొడ్డిమార్గంలో వెళ్తూ ఒకరు ప్రాణాలు కోల్పోయారు.

ప్రకాశం జిల్లాకు చెందిన వినయ్ తాడేపల్లిలోని ఓ ప్రైవేట్ యూనివర్సిటీలో బీబీఏ చదువుతున్నాడు. అదే యూనివర్శిటీలో చదువుతున్న తోటి విద్యార్థినీతో ప్రేమలో పడ్డాడు. ఐదేళ్లుగా వారి ప్రేమాయణం సాగుతోంది. అయితే ఆదివారం సెలవు కావడంతో ప్రేమికులు ఇద్దరు కలిసి బయటకు వెళ్లారు. తిరిగి వచ్చే సరికి రాత్రి అయింది.

యువతిది మహిళా హాస్టల్ కావడంతో మెయిన్ గేట్ నుంచి వెళ్తే వార్డన్ కు తెలుస్తుందని భావించారు. ఈ క్రమంలో ప్రియురాలిని హాస్టల్ గోడ దూకించి లోపలికి పంపించాలని చూశాడు వినయ్. హాస్టల్ గోడ దూకుతున్న యువతిని చూసిన వాచ్ మెన్.. ఎవరోనని గట్టిగా కేకలు వేశాడు. ఆ కంగారులో వినయ్ హాస్టల్ లోని 5వ అంతస్తుకు పరుగులు తీశాడు. అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో పైనుంచి కింద పడి వినయ్ మృతి చెందాడు. వినయ్ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..